“Commissioner Urges Transparent Sadar Exams in Tirupati”
*’సదరం’ పరీక్షల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించండి..
*కమిషనర్ ఎన్. మౌర్య..
తిరుపతి(నేటి ధాత్రి)అక్టోబర్
09:
సదరం ధ్రువ పత్రాల కొరకు నిర్వహించే పరీక్షలను పారదర్శకంగా ప్రభుత్వ నిబంధలను పాటిస్తూ నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య వైద్యులకు సూచించారు. వికలత్వం యొక్క శాతాన్ని నిర్దారిస్తూ రుయాసుపత్రి లో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను గురువారం ఉదయం కమిషనర్ తనిఖీ చేశారు. ఏ విధంగా పరీక్షలు చేస్తారు, రోజూ ఎంతమందికి పరీక్షలు నిర్వహిస్తున్నారనే విషయాలను రుయా వైద్యులు కమీషనరకు వివరించారు. చెవి, ముక్కు, ఎముకలు, మానసిక రోగులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ వైద్యులు అందించే సదరం ధ్రువ పత్రాల మేరకు వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇందులో ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు పారదర్శకంగా పరీక్షలు చేయాలాని వైద్యులకు సూచించారు. పరీక్షల కొరకు వచ్ఛే వారికి తాగునీరు, నీడ తదితర మౌళిక వసతులు కల్పించాలని తెలిపారు. రోజుకి వందమందికి పరీక్షలు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రాధ, ఆర్ ఎం ఓ డాక్టర్ హరికృష్ణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, పలువురు వైద్యులు ఉన్నారు
