SP Issues Fog Safety Advisory
పొగమంచు తీవ్రత పెరుగుతుంది
రాత్రి తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్ద
ఎస్పీ కిరణ్ ఖరే, ఐపీఎస్
భూపాలపల్లి నేటిధాత్రి
వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి, తెల్లవారుజామున అవసరం తప్ప ప్రయాణాలు చేయవద్దని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, ఐపీఎస్ ప్రజలకు సూచించారు.
ఇటీవల పొగమంచు కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాల దృష్ట్యా, ఎస్పీ ప్రజలను హెచ్చరిస్తూ—దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులను గమనించే సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతుందని, అల్ప నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని తెలిపారు. అత్యవసర పరిస్థితులు తప్ప ఈ సమయాల్లో ప్రయాణాలు నివారించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అలాగే, పొగమంచు ఎక్కువగా ఉన్న సమయంలో వాహనాలు నడిపేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎస్పీ వివరించారు.
వాహనాలను వేగంగా నడపకూడదని
శ్రద్ధగా, నిదానంగా ప్రయాణించాలని
తక్కువ దూరం మాత్రమే కనిపించే పరిస్థితుల్లో హెడ్లైట్లను లో బీమ్‌లో ఉంచి, ఫాగ్ లైట్లను తప్పనిసరిగా ఉపయోగించాలి అని సూచించారు.
అత్యవసరంగా ప్రయాణం తప్పనిసరి అయినపుడు బ్రేకులు, లైట్లు, టైర్లు వంటి వాహన భాగాలను తప్పకుండా ముందుగానే తనిఖీ చేసుకోవాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, అకస్మాత్ ఓవర్‌టేక్‌లు, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు వంటి ప్రమాదకర చర్యలు పూర్తిగా నివారించాలని హెచ్చరించారు.
పోలీసుల సూచనలు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా వాహనదారులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు
