పొగమంచుతో వాహనదారులకు ఇక్కట్లు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీని కారణంగా చిన్న, మధ్యతరహా వాహనాల చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాల వేగం తగ్గిపోవడంతో పాటు, ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాల భయం నెలకొంది. పొగమంచు కారణంగా రహదారిపై దృశ్యమానత తగ్గి, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
