తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుత ధరలివే..
దేశంలో బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. ప్రస్తుతం.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,860గా ఉండగా.. కిలో వెండి రేటు రూ.2,11,000గా ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంటర్నెట్ డెస్క్: నేటి మార్కెట్లో బంగారం ధరలు కాస్తంత తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. హైదరాబాద్‌లో మంగళవారం నాటికి దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1520 మేర తగ్గి.. రూ.1,33,860గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ గోల్డ్‌పై రూ.1,400 పతనమై.. రూ.1,22,700గా ఉంది. ఇక వెండి విషయానికొస్తే.. నిన్న ఆకాశాన్నంటిన వెండి(Silver) ధరలు.. ఇవ్వాళ కాస్త తగ్గాయి. ప్రస్తుతం.. కిలో వెండి రేటు రూ.2,11,000గా ఉంది(Gold, Silver Prices on Dec 16).చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి పసిడి ధర రూ.1,34,730గా ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రేటు రూ.1,34,010గా ఉంది.సోమవారం భారీ స్థాయిలో గరిష్ఠ స్థాయికి ఎగబాకిన వెండి రేట్లు నేడు కాస్త తగ్గాయి. నిన్నటితో పోల్చగా.. కిలో వెండిపై రూ.3,900 మేర తగ్గింది. ప్రస్తుతం.. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.2,11,000గా ఉంది. చెన్నై సహా పలు ప్రముఖ నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. భారత్-అమెరికా డీల్‌పై కొనసాగుతున్న సందిగ్ధత, డాలర్‌తో పోలిస్తే తగ్గుతున్న రూపాయి మారకం విలువ, ఫెడ్ వడ్డీ రేటులో కోత వెరసి పసిడి, వెండి ధరలకు రెక్కలొచ్చేలా చేస్తున్నాయి.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు ఆ సమయంలో మరోసారి ధరలను పరిశీలించగలరు.
–
