
Teachers Honored for Focusing on New Education Policy
నూతన విద్యా విధానంపై దృష్టిసారించాలి
ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి
నస్పూర్ లో ఉత్తమ ఉపాధ్యాయులకు ట్రస్మా ఘన సన్మానం
శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఉపాధ్యాయులు నూతన విద్యా విధానంపై దృష్టిసారించాలని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్‌రెడ్డి సూచించారు.ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్రస్మా ఆధ్వర్యంలో బుధవారం నస్పూర్ పట్టణంలోని ఎంఎం గార్డెన్లో మంచిర్యాల జిల్లాకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్‌రెడ్డి,ఎంఈవో పద్మజ,ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మలేత్తుల రాజేంద్రపాణి,జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్,తదితరులు పాల్గొని డాక్టర్ సర్వేపల్లి రాధకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ..ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనా వారికి అభినందనలు తెలియజేశారు.ఆర్టిఫిషిల్ ఇంటిలిజెన్స్ కాలంలో సెలబస్ మొత్తం కొత్త పుంతలు తొక్కుతుందని,దీనికి అనుగుణంగా విద్యా బోధనలో మార్పులు తీసుకురావాల్సిన అవశ్యకత ఎంతో ఉందన్నారు. 2027–28లో రాష్ట్రంలో కొత్త విద్యా పాలసీ రాబోతుందని, దీంతో విద్యా విధానంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు తెలిపారు.వెనుగబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. పిల్లలకు అర్థమైయ్యే విధంగా పాఠాలు బోధించాలని, ముఖ్యంగా పిల్లలతో ఎక్కువగా ప్రాక్టీస్ చేపిస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు.ప్రతి ఉపాధ్యాయుడు తమ సబ్జెక్టులపై పట్టుసాధిస్తే విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దవచ్చని సూచించారు.
ఉపాధ్యాయులకు సబ్జెక్టుల వారిగా మోటివేషన్, ఓరియంటేషన్ క్లాసులను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.అనంతరం ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణి, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ లు మాట్లాడుతూ..ట్రస్మా ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు త్వరలోనే హెల్త్ స్కీంను ప్రారంభిస్తామన్నారు.తాము ఇతర సంఘాల్లా కాకుండా ఒక క్రమశిక్షణతో విద్యా సంస్థలను నడిపిస్తూ విద్యాబోధన, ఉపాధ్యాయుల సంక్షేమం, పలు సేవా కార్యక్రమాలను స్వంత ఖర్చులతో చేస్తున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 78మంది ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలు,పూల మాలలతో ఘనంగా సన్మానించి,ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్మా నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, రజనీ,రేగళ్ల ఉపేందర్,మైదం రామకృష్ణ,ఊట్ల సత్యనారాయణ,అంబాల రాజ్ కుమార్,పెట్టం మల్లయ్య, బత్తిని దేవన్న,కృష్ణారెడ్డి, అంబాల రాజ్ కుమార్ అమన్ ప్రసాద్,సమ్మిరెడ్డి,మమత, జూల్పెకర్, సత్యనారాయణరెడ్డి, జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, ట్రస్మా ప్రతినిధులు పాల్గొన్నారు.