
Farmers
పొంగిన వాగులు.. మునిగిన పొలాలు….
జహీరాబాద్ నేటి ధాత్రి:
వరుణుడి జాడ కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు జహీరాబాద్ నియోజకవర్గం పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా చోట్ల రైతులు పత్తి, సోయాబీన్, పంటల విత్తనాలను వేశారు.రైతులు వర్షం కోసం ఎదురు చూస్తుండగా శుక్రవారం కురిసిన వర్షం ప్రాణం పోసింది.

జహీరాబాద్:-
వారం రోజులుగా విపరీత మైన ఉష్ణోగ్రతలు నమోదైన వేళ వరుణదేవుడు కరుణించడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మండలంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి వర్షం భారీగా కురవడంతో రైతన్నల్లో ఆనందం వెల్లువెరిసింది. ఖరీఫ్‌లో పంటల సాగుకు అనుకూలంగా వర్షం కురిసిందని, పొలాలను దుక్కి చేసుకోవ డానికి అవకాశం ఏర్పడిందని రైతులు పేర్కొన్నారు. ఈ వేసివిలో భూగర్భ జలాలు అడుగంటి చాలా బోరుబావుల నుంచి నీరు రావడంలేదు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో బోరుబావులు రీచార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రైతులు అంటున్నారు. ఏది ఏమైనా ఖరీఫ్ ప్రారంభంలో వరుణ దేవుడు కరుణించడంతో రైతుల్లో సంతోషం కనిపిస్తోంది.
ఝరాసంగం:-
ఝరాసంగం మండలంలో శుక్రవారం సాయంత్రం
ఓ మోస్తరు వర్షం కురిసింది. ఓ వైపు ఎండ కొడుతుండగానే ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. రోజంతా తీవ్రమైన ఎండ,ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు సాయంత్రం చల్లని ఈదురుగాలులతో ఉపశమనం పొందారు.
కోహిర్:-
మండలంలోని ఆయా గ్రామాల్లో
మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. పది రోజులుగా వర్షాల జాడ లేక విత్తనాలు వేసిన రైతులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో వర్షం కురవడంతో విత్తనానికి, ప్రాణం పోసిందన్నారు.
న్యాల్కల్:-
మండలంలోని ఆయా గ్రామాల్లో
మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. పది రోజులుగా వర్షాల జాడ లేక విత్తనాలు వేసిన రైతులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో వర్షం కురవడంతో విత్తనానికి, మొలకలకు జీవం పోసినట్లయింది. ఆశించిన స్థాయిలో వర్షం కురవడంతో పలు గ్రామాల్లో రైతులు పత్తి విత్తనాలు మొలకలను ఇంటిల్లిపాదిగా పొలం బాట పట్టారు.
మొగుడంపల్లి:-
మండల వాసులు శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ఉపశమనం పొందారు. దాదాపు 7 గంటలకు పైగా 90 మి.మీ. వర్షం కురవడంతో ఖరీఫ్ పనులు ఊపందుకున్నాయి. వారం రోజుల నుంచి పత్తి విత్తనాలు విత్తుకున్న రైతులు ఈ వానతో ఊపిరి పీల్చుకున్నారు.