
Flood problems need time to end.
ముంపు సమస్యల సమయాత్తం కావాలి
రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్
*ముంపు నివారణ కోసం వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు,
జిడబ్ల్యూఎంసీ కమిషనర్ లతో సమీక్షా*
అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో గ్రేటర్ నగరంలోని ప్రధాన నాలలను పరిశీలించిన స్పెషల్ సీఎస్
వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి:
వర్షాకాలంలో తలెత్తే ముంపు సమస్యలను ఎదుర్కొనేందుకు
అధికారులు ప్రణాళికాబద్ధంగా సమాయాత్తం కావాలని రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు.

సోమవారం జిడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో అరవింద్ కుమార్ వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, స్నేహ శబరిష్, జిడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి లతో కలసి గ్రేటర్ వరంగల్ నగరంలో
వర్షాకాలంలో వరదల ముంపు నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు ప్రణాళికల్లో భాగంగా, వరద ముంపు ప్రాంతాలను గుర్తించడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండటం వంటి అంశాలపై కూలంకషంగా సమీక్షించి సమర్ధవంతంగా నిర్వహించుటకు అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ మాట్లాడుతూ గతంలో వరద ముంపు సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలన్నారు.వర్షాకాలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని,ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలన్నారు.అందుకుగాను ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.సకాలంలో స్పందించకపోతే చిన్నసమస్య కూడా పెద్ద విపత్తుగా మారే అవకాశం ఉంటుందని అరవింద్ కుమార్ అధికారులను హెచ్చరించారు.అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నగరంలోని ప్రధాన నాలల స్థితిగతులు, పూడికతీత పై సమీక్షిస్తూ వరద నీరు నిలువకుండా నాలాల్లోకి పంపేలా ముందస్తుగా పనులు చేయాలని తెలిపారు.బయటి నుంచి వచ్చే వరద నీటిని దారి మళ్లించేలా చూడాలని, జిల్లాలో బల్దియా ఆధ్వర్యంలో నిర్వహించబడే డిఆర్ఎఫ్,జిల్లా అగ్నిమాపక శాఖ,ఎస్డిఆర్ఎఫ్ బృందాలు భారీ వర్షాలవల్ల నష్టం జరగకుండా ముంపు నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు.రాష్ట్ర స్థాయిలో 6 ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని అత్యవసత్యవసర పరిస్థితుల్లో ఈ బృందాలను వినియోగించుకోవాలని అన్నారు.

దీంతో పాటుగా ఆపద మిత్ర వాలంటీర్ల సేవలు కూడా ఉపయోగించుకోవాలన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా, సైరన్ ద్వారా నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. పునరావాస కేంద్రాలను ముందుగానే సిద్దం చేసుకోవాలన్నారు.గ్రేటర్ వరంగల్ లోని 66 డివిజన్ల కార్పొరేటర్లు, ఆధికారులతో వాట్స్అప్ గ్రూప్ ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు చేపట్టాలని తెలిపారు.సీజన్ వ్యాధులు ప్రబలే నేపథ్యంలో ముఖ్యంగా తాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.ఎన్డిఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ దామోదర్ సింగ్ మాట్లాడుతూ ముందస్తుగా వరద నివారణ ప్రణాళికలను చేసుకొన్నచో సునాయసంగా వరదనుండి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవచ్చునని అన్నారు.వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ వర్షాకాలంలో తక్షణ చర్యలకు అవసరమైన సిబ్బంది, వాహనాలు, డ్రైనేజీ పరికరాలు సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందుగానే సమర్థవంతమైన ప్రణాళికతో ఉన్నట్లు తెలిపారు.

సత్వర సహయార్ధం జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1800 425 3424 ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాలో డి.ఆర్ ఎఫ్ బృందాలతో పాటు ఆపద మిత్ర వాలంటీర్ల సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో తాగునీటి కలిషితం కాకుండా ప్రత్యేక చొరవ తీసుకునున్నట్లు, అన్ని చెరువుల ఎఫ్టిఎల్ మ్యాప్పింగ్ చేస్తున్నట్లు తెలిపారు.హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ లో గల 193 లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధవహించి ఎప్పటికప్పుడు సానిటేషన్ నిర్వహణతో పాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టుటకు అప్రమత్తంగా ఉంచడం జరిగిందన్నారు.ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు అసిస్టెంట్ ఇంజనీర్, సానిటరీ ఇన్స్పెక్టర్, కార్మికులతో ప్రత్యేక బృందాలను నియమించడం జరిగిందన్నారు.బల్దియా కమిషనర్ చాహాత్ బాజ్ పాయి మాట్లాడుతూ కార్పొరేషన్ కు చెందిన సమాచారాన్ని అందజేయడానికి నగర వ్యాప్తం గా 5 ప్రాంతాల్లో వేరియబుల్ మెసేజ్ డిస్ప్లే బోర్డ్ సమాచారాన్ని ప్రదర్శిస్తూ ప్రజలకు అప్రమత్తం చేయడం జరుగుతున్నదని,బల్దియా ప్రధాన కార్యాలయం లో టోల్ ఫ్రీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 1980 ఫోన్ నెం :9701999645, వాట్స్ అప్ నెం: 9701999676 ద్వారావర్షానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్న సత్వరమే సహాయం అందించనున్నట్లు తెలిపారు.ప్రజలకు పబ్లిక్ అనౌన్స్ మెంట్ ద్వారా కూడా సమాచారం అందిస్తూ ఐసిసిసి ద్వారా ఎప్పటికపుడు వర్షపాత తీవ్రత ను గుర్తిస్తూ క్షేత్ర స్తాయి లో ఉండే అధికారులకు సమాచారం అందజేసి పరిష్కరించేలా చూస్తున్నట్లు,100 కార్యాచరణలో భాగంగా సిడిఏంఏ సూచించినట్లు డ్రైన్ లకు మెష్ లు ఏర్పాటు చేస్తూ లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికపుడు డీ వాటరింగ్ , శానిటేషన్ కు సంబంధించి డ్రైన్ లలో ఎప్పటికపుడు చెత్త తొలగింపు ప్రక్రియ భారీ వర్షాలు కురిసే క్రమంలో ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించి వారికి బెడ్ షీట్లు ఆహారం అందించేలా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ అన్నారు.శిథిల భవనాలకు నోటీసులు జారీ, వారిని తక్షణమే ఖాళీ చేయించడం జరుగుతున్నదని అన్నారు.అనంతరం ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి నయీమ్ నగర్ నాలా, రాజాజీ నగర్ కల్వర్టు, ప్రెసిడెంట్ పాఠశాల నుండి నయీమ్ నగర్ వరకు రిటర్నింగ్ నిర్మించిన రిటైనింగ్ వాల్, జవహర్ నగర్, సమ్మయ్య నగర్, భద్రకాళి చెరువు ఎఫ్ టి ఎల్ లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సమావేశంలో అదనపు కమిషనర్ జోనా,ఉప కమిషనర్లు రవిందర్, పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, ఎలక్ట్రిక్, డిఆర్ ఎఫ్, టౌన్ ప్లానింగ్, స్మార్ట్ సిటీ విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.