తెలంగాణ స్వాభిమాన పతాక

https://epaper.netidhatri.com/

`స్వావలంబన అభిమాన గీతిక.

`తెలంగాణ ప్రగతి ఆత్మ గౌరవ ప్రతీక.

` కేంద్ర సాయం మీద ఆధారపడకుండా నిలిచిన వేధిక.

`విభజన హామీలు అమల కోసం ఎదురు చూడకుండా ఎదిగిన అభివృద్ధి నమూన.

` కేసిఆర్‌ నిరంతర శ్రమ..అహర్నిశలు పడిన తపన.

`ఇంత వేగవంతమైన అభివృద్ధి ఒక్క కేసిఆర్‌ తోనే సాధ్యమైంది.

`ఉమ్మడి పాలకులు పీల్చి పిప్పి చేశారు.

`పదేళ్లలో కేసిఆర్‌ నిలబెట్టి చూపించారు.

`తెలంగాణ బాగు పడడం గిట్టని వాళ్ల కళ్లు కుళ్లుకుంటున్నాయి.

`తెలంగాణను దోచుకోవాలని చూస్తున్నాయి.

`తెలంగాణకు మళ్ళీ పాత రోజులు తేవాలని చూస్తున్నాయి.

తెలంగాణ పోరాటి సాధించుకున్న ఆత్మ గౌరవ పతాక. స్వాభిమాన వీచిక. గుండె ధైర్యం నిండిన విజయ వేధిక. ఉద్యమమే నినాదమైన, తెలంగాణ పదమే వేదమైన కరదీపిక. దేశానికే వెలుగు రేఖ. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల స్వావలంబన గీతిక. ఇంత గొప్పది నా తెలంగాణ. ఆ తెలంగాణ రావడానికి, నేడు బంగారు తెలంగాణ నిర్మాణం జరిగింది ఒక్కరితోనే. ఆ ఒక్కరే ముఖ్యమంత్రి కేసిఆర్‌. అసలు తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. ఆత్మాభిమాన ఉద్యమ బాట. తెలంగాణకు పోరాటం కొత్త కాదు. గెలవడం కొత్త కాదు. సమస్యలు కొత్త కాదు. వాటిని అధిగమించడం కొత్త కాదు. గెలిచి నిలబడిన చరిత్ర కొత్త కాదు. ఎప్పుడూ ఏదో ఒక చరిత్ర సృష్టించడమే తెలంగాణ గొప్పదనం. ప్రపంచ దేశాలకే పోరాట విలువలు నేర్పిన ఏకైక ప్రాంతం తెలంగాణ. నిజాం కాలంలో రైతంగా సాయధ పోరాటమైనా, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమమైనా వ్యవస్ధలకు పట్టుదలను రుచి చూపించిన నిఘంటువు నా తెలంగాణ. భూమికోసం , భుక్తి కోసం, బానిస సంకెళ్ల విముక్తికోసం పోరాటాలు ఎన్ని జరిపినా అలసిపోలేదు. అలాగే అభివృద్దిలోనూ ఆగిపోలేదు. పోరాటమైనా, ప్రగతి దారైనా ముందుకే. తెలంగాణ ఎవరి సహాకారం కోరదు. తెలంగాణ ఎవరి మీద ఆధారపడదు. ఇది నిరూపించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌.
తెలంగాణ రాక ముందు ఉద్యమ సమయంలో సీమాంధ్ర నేతలు ఎన్ని మాటలు అన్నారో విన్నాం.
తెలంగాణ వచ్చిన తర్వాత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత పదేళ్లుగా తెలంగాణ గురించి మాట్లాడుతున్న మాటలు వింటున్నాం. అయినా ఎక్కడా వెరవలేదు. ఆగిపోలేదు. అలసిపోలేదు. దేశంలో అన్ని రాష్ట్రాలను దాటకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఏనాడో గుజరాత్‌ను వెనక్కి నెట్టేశాం. ఇదే బిజేపికి నచ్చని విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును బిజేపి సహకరించిందన్న మాట మినహా…2014 నుంచి తెలంగాణ కోసం కేంద్రం ఏ సహాయం చేయలేదన్నది తెలుసుకోవాలి. 2014 ఎన్నికల్లో సాక్ష్యాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి కొండ కింద ప్రధాని మోడీ మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని అన్నారు. ఆ తర్వాత ఆ మాటను అనేక మార్లు ఉటంకించారు. అవకాశం దొరికనప్పుడల్లా తెలంగాణ మీద విషం కక్కారు. తెలంగాణ ఏర్పాటు కావడం తనకు ఇష్టం లేదన్నంతగా పరక్ష వ్యాఖ్యలు చేశారు. 1998లో కాకినాడలో జరిగిన బిజేపి పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ తీర్మాణం చేసి, ఉత్తరాధిన మూడు రాష్ట్రాలు ఇచ్చింది. కాని తెలంగాణను వదిలేసింది. నిజానికి బిజేపి ప్రభుత్వ హాయంలో ఇచ్చిన మూడు రాష్ట్రాలకన్నా ముందు నుంచి సాగుతున్న ఉద్యమం తెలంగాణది. 1956లోనే నాటి ప్రధాని నెహ్రూ తెలంగాణ ప్రజలు వద్దనుకున్న నాడు ప్రత్యేకమైపోవచ్చు. అని కూడా చెప్పారు. కాని ఆయన హయాంలో కుదరలేదు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఇవ్వలేదు. ఎవరూ ఇవ్వలేదు. ఆఖరకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ సారధ్యంలో సాగిన పద్నాలుగేళ్ల నిరంతర పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది. దీన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ జీర్ణించుకోవడం లేదు. గతంలో పాత పార్లమెంటులో పలుసార్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుపట్టారు. ఆఖరుకు ఇటీవల కొత్త పార్లమెంటు తొలి రోజున కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు సంతోషంగా లేరన్నారు. ఇదే ఒక ప్రధాని చేయాల్సిన వ్యాఖ్యలు. అయినా సరే తెలంగాణ ప్రజలు భరిస్తూనే వున్నారు.
ఇక తెలంగాణ ఇస్తే చిమ్మ చీకట్లౌతుందని సీమాంధ్ర నేతలు అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి అసలు తెలంగాణ మనుగడే సాధ్యం కాదన్నారు. తెలంగాణ వస్తే ఇక అంధకారమే అంటూ కర్ర పట్టుకొని చీకట్లో నిలబడి కరంటు లెక్కలు చెప్పాడు. ఇప్పుడు ఆ కిరణ్‌కుమార్‌ రెడ్డే తెలంగాణ వెలుగులను చూస్తున్నారు. తెలంగాణ వస్తే కనీసం పెండిరగ్‌ ప్రాజెక్టులు కూడా పూర్తి చేసుకోలేరనాన్నరు. హైదరాబాద్‌లో మత కల్లోలాలు వస్తాయన్నారు. అసలు తెలంగాణ భూములు తొండలు గుడ్లు పెట్టడానికి కూడా పనికిరావన్నారు. ఇలా ఎవరికి ఇష్టమెచ్చినట్లు వాళ్లుమాట్లాడారు. తెలంగాణ పూర్వ చరిత్ర ఏమిటో తెలుసుకోకుండా ఎవరికి తోచించి వారు మాట్లాడారు. కాని తెలంగాణకు ఒక చరిత్ర వుంది. తొలి తెలుగు చరిత్ర మొదలైందే తెలంగాణలో…కరీంనగర్‌ జిల్లాలోని కోటి లింగాలలోనే తొలి శాతవాహన చరిత్రకు శ్రీకారం జరిగింది. ఆ తర్వాతే ధాన్య కటకానికి వెళ్లింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ చరిత్రను కనుమరుగు చేశారు. అలా మొదలైన తెలంగాణ ప్రస్తానం కాకతీయ కాలంలో ఉచ్చదశకు చేరుకున్నది. సంపన్న ప్రాంతమై విలసిల్లింది. సుమారు 300 సంవత్సరాలకు పైగా సాగిన కాకతీయ చరిత్రలోనూ తెలంగాణది స్వర్ణయుగమే. ఆ తర్వాత మొగలులపాలనైనా, నిజాం పాలన దాకా తెలంగాణలో కరువు లేదు. ఎందుకంటే నిజం కాలంలో హైదరాబాద్‌ వజ్రాల వ్యాపారానికి పేరెన్నిక కగన్నది. లండన్‌ మహారాణికి అత్యంత విలువైన వజ్రాల హారాన్ని బహూకరించింది నిజాం రాజు. లండన్‌ వీధుల్లో తిరిగే రోల్స్‌ రాయిస్‌ కార్లతో హైదరాబాద్‌ వీధులు ఊడిపించిన చరిత్ర తెలంగాణది. అలాంటి తెలంగాణపై ఎవరు వ్యాఖ్యలు చేసినా వాళ్లే చరిత్ర హీనులయ్యారు.
అలాంటి తెలంగాణను తెచ్చింది కేసిఆర్‌. నిలబెట్టింది కేసిఆర్‌.
పదేళ్లలో తెలంగాణ ప్రగతి రాకెట్‌ కన్నా వేగంగా దూసుకెళ్లింది. అసలు తెలంగాణలో తాగు నీరే దొరకదు. ఇక సాగు నీటి సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు. అలాంటి తెలంగాణలో కేంద్రం నుంచి రూపాయి సాయం లేకున్నా,ఎలాంటి సహాకారం లేకున్నా కాళేశ్వరం లాంటి అధ్భుతమైన ప్రాజెక్టును ఎవరూ ఊహించని రీతిలో నిర్మాణం జరిగింది. తెలంగాణ మొత్తం సస్యశ్యామం చేసేందుకు కారణమైంది. అసలు తెలంగాణ సాధించిన మూడేళ్లకే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేయడం అంటే మాటలు కాదు. మంత్రి హరీష్‌రావు రాత్రింబవళ్లు పర్యవేక్షణ, ముఖ్యమంత్రి కేసిఆర్‌ పరిశీలన, అంకిత భావం వున్న తెలంగాణ ఇంజనీరింగ్‌ వ్యవస్ధ కలిసి సృష్టించిన భగీరధ నిర్మాణం కాళేశ్వరం. అదే సమయంలో నిర్మాణం మొదలైన పోలవరం అక్కడే ఆగిపోయింది. కాళేశ్వరం పూర్తి చేసుకున్న తర్వాత మొదలు పెట్టిన పాలమూరు..రంగారెడ్డి కూడా పూర్తియ్యింది. దాంతో తెలంగాణ మొత్తం నీటి గంగాలమైంది. వీటి నిర్మాణం సాగుతుండగానే తెలంగాణలోని నలభై ఆరు చెరువులకు పూర్వ వైభవం తేవడం జరిగింది. అనేక రిజర్వాయ్యర్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఎన్నేళ్ల కలగానో మిగిలిపోయిన మానేరు ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయి. ఖమ్మంలో సీతారామా లాంటి ప్రాజెక్టులు కూడా నీళ్లందిస్తున్నాయి. నీటి చుక్కకు కోసం కన్నీళ్లు కార్చిన తెలంగాణ కళ్లలో ఆనందభాష్పాలు చూస్తున్నామంటే అది కేసిఆర్‌. ఆయన సాగునీటి రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ఒక యజ్ఞంగా చేపట్టారు. తెలంగాణ మొత్తం నీరందించి, సస్యశ్యామలం చేశారు. ఇక కరంటు కష్టాలు తెలంగాణ తెచ్చిన మూడు నెలల్లో తీర్చాడు. రైతాంగానికి దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరంటు ఇస్తున్నారు. హైదరాబాద్‌ను పెట్టుబడుల స్వర్గధామం చేశాడు. ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా చేశాడు. ఐటి రంగానికి కేరాఫ్‌ చేశాడు. పార్మా రంగంలో తెలంగాణను అగ్రగామి చేశాడు. హైదరాబాద్‌లో ట్రాపిక్‌ సమస్యకు పరిష్కారం చూపెట్టారు. ఈ పదేళ్ల కాలంలో 37 కొత్త ప్లైఓవర్లు నిర్మాణం చేశారు. కొత్త కొత్త నిర్మాణాలు చేసి, హైదరాబాద్‌ రూపు రేఖలు మార్చేశారు. కొత్త సెక్రటెరియేట్‌, ముప్పై మూడు జిల్లాల్లో కొత్త జిల్లా కలెక్టర్ల సముదాయ భవనాలు. అమర వీరుల స్మృతి వనం. 125 అడుగుల అంబెద్కర్‌ విగ్రహంతో కొత్త హైదరాబాద్‌ను ఆవిష్కరించారు. తెలంగాణను ఆరోగ్యవంతమైన రాష్ట్ర్రంగా తీర్చిదిద్దుతున్నారు. 33 జిల్లాల్లో కొత్తగా వైద్య విద్యాలయాలు ఏర్పాటుచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రం సహాకారం లేకుండా, పైసా సాయం లేకుండా నిలబడిరది తెలంగాణ. దాన్ని రూప శిల్పి ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఆయన పేరే ఒక బ్రాండ్‌. హైదరాబాద్‌ ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌. దటీజ్‌ తెలంగాణ…దిసీజ్‌ ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన. ఎనీ డౌట్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *