
Indian Workers' Union
భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా
నాగారం పురపాలక సంఘం ఆవరణంలో భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది భారతీయ మజ్దూర్ సంఘం ఏర్పడి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జండా ఆవిష్కరణ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్ర రెడ్డి, మాజీ జెడ్పిటిసి మునుగంటి సురేష్, మాజీ కౌన్సిలర్ బిజ్జా శ్రీను గౌడ్, అదేవిధంగా బిఎమ్ఎస్ రాష్ట్ర నాయకులు రాము, రాఘవేందర్, పురుషోత్తం ప్రవీణ్ మరియు బిఎమ్ఎస్ సభ్యులు నాగారం పురపాలక సంఘ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్ర రెడ్డి, మాట్లాడుతూ కార్మికుల శ్రమ దోపిడీ ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి కచ్చితంగా అందరూ ఐకమత్యంతో ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు అదేవిధంగా సురేష్, మాట్లాడుతూ రోజుకు ఎనిమిది గంటలు వారానికి 48 గంటలు పని చేయాలి అంతకుమించి ఎక్కువ పని చేసినట్లయితే వారికి ఓటి ఇవ్వాలి మరియు వారికి ఆదివారం రోజు కచ్చితంగా సెలవుదినంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.