
MRO Vijayalakshmi
పరకాల పట్టణంలో పలుచోట్ల ఘనంగా జెండా పండుగ
క్యాంపు కార్యాలయంలో జెండా ఎగరావేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగరవేసిన అధికారులు
పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో అమరధామం యందు ఆగస్టు 15 రోజున 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు రేవూరిప్రకాశ్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా జాతీయ పతాకాన్ని ఎగరావేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ఆర్డీఓ కార్యాలయంలో….
పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్డీఓ డాక్టర్.కన్నం.నారాయణ జెండా ఎగరావేయడం జరిగింది.అనంతరం జాతీయ గీతాలాపన చేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ స్టేషన్ లో….
79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణలోని పరకాల పోలీస్ వారి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ స్టేషన్ ప్రాంగణం లో జెండా ఎగరవేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రమేష్ బాబు,విఠల్,మహిళపోలీసులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఎమ్మార్వో కార్యాలయంలో…..
పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవం సందర్బంగా ఎమ్మార్వో విజయలక్ష్మి జెండా ఎగరావేయడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ మహనీయులను అనుదినం స్మరించుకోవాలని వారి త్యాగల ఫలమే ఈ రోజని అన్నారు.ఈ కార్యక్రమంలో డీటీ.సుమన్,ఎలక్షన్ డీటీ.సూర్యప్రకాష్,ఎం.ఆర్ఐ అశోక్ రెడ్డి,దామోదర్,ఏఎస్ఓ కుమారస్వామి, ధరణి ఆపరేటర్ రఘుపతి,సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్,ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ భద్రయ్య, జూనియర్ అసిస్టెంట్ అర్జున్,రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎంపిడిఓ కార్యాలయం లో…….
79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది.ఆంజనేయులు జాతీయ పతాకాన్ని ఎగరావేశారు.అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు ఎల్లంకి బిక్షపతి,కార్యాలయ పర్యవేక్షకులు సిహెచ్ శైలశ్రీ, ఏపిఓ ఇందిర,కార్యాలయ, ఈజీయస్ సిబ్బంది,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
వ్యవసాయ మార్కెట్ లో……
స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ,ఏఐటీయూసీ హమాలి యూనియన్ ఆధ్వర్యంలో సిపిఐ జిల్లాకౌన్సిల్ సభ్యుల లంక దాసరి అశోక్ అధ్యక్షతన 79వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.అనంతరం హమాలి యూనియన్ నాయకులు మహనీయుల చిత్రపటాలకు పూలతో నివాళులు అర్పించి జెండావిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగెళ్లి శంకర్,శ్రీపతి రాజయ్య,హమాలీ సీనియర్ ముఠామేస్త్రి బొట్ల భద్రయ్య,కొడపాక ఐలయ్య,కోయిల శంకరయ్య,కోట యాదగిరి,గుట్ట రాజయ్య ల్,దొడ్డే పోచయ్య,కార్మిక నాయకులు పాల్గొన్నారు.