
Cultivating Marijuana.
గంజాయి సాగు చేసినందుకు ఐదేళ్లు జైలు శిక్ష.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం అక్రమంగా గంజాయి సాగు కేసులో
నిందితురాలికి ఐదేళ్లు జైలు శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ సంగారెడ్డి జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి కె. జయంతి మంగళవారం తీర్పు వెల్లడించినట్లు జహీరాబాద్ ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం ఝరాసంగం మండల పరిధిలోని జూనేగావ్ (ఇస్లాంపూర్) గ్రామానికి చెందిన బోయిని సావిత్రమ్మ అనే మహిళ తన వ్యవసాయ పొలంలో 2020లో అక్రమంగా 175 గంజాయి మొక్కలను సాగు చేస్తూ ఎక్సైజ్ పోలీసు లకు పట్టుబడింది. ఈ మేరకు ఎక్సైజ్ పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసుకొని రిమాండ్ కు తరలించారు. అనంతరం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి పీపీ టి. రాజేశ్వర్ తన వాదనలు బలంగా వినిపించడంతో, నేరం రుజువుకావడంతో నిందితురాలికి శిక్ష ఖరారు చేస్తూ అదనపు జడ్జి తీర్పు ఇచ్చారు. ఎవరైనా అక్రమంగా గంజాయి సాగు చేసిన, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ ఈ సందర్భంగా హెచ్చరించారు.