
మూడు సంవత్సరాల చిన్నారి పరిస్థితి విషమం
జమ్మికుంట: నేటిధాత్రి
జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేయడంతో ఐదుగురికి గాయాలు కాగా మూడు సంవత్సరాల చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఆస్పత్రికి తరలించారు. పిచ్చికుక్కల దాడిలో గండీస్వరూప, మొగిలి పాక వెంకటస్వామి తోపాటు మరో ఇద్దరు గాయపడగా ఇంటిముందు ఆడుకుంటున్న మద్దర్ల అక్షర అనే పాపపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని వరంగల్ ఆసుపత్రికి తరలించారు. ప్రజలను గాయపరుస్తూ తిరుగుతున్న పిచ్చికుక్కను పంపి వేయాలంటూ స్థానికులు గ్రామపంచాయతీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్థానికులు కుక్కలు వెంటాడి చంపివేశారు. మండలంలో పిచ్చికుక్కల బెడద ఎక్కువగా ఉండడంతో పలువురికి గాయాలు కావడంతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.