ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో.!

Indiramma Houses.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి

జహీరాబాద్: నేటి ధాత్రి:

 

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి
కొన్నింటి.నర్సింలు డిమాండ్ చేశారు. గురువారం జహీరాబాద్ ఆర్డీఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో వికలాంగులతో ప్రత్యేకంగా శ్రమ శక్తి సంఘాలు ఏర్పాటు చేసి జాబ్ కార్డ్స్ ఇచ్చి 150 రోజులు పని కల్పించాలని అన్నారు. .రాజీవ్ యువ వికాసం పథకంలో వికలాంగులకు 5 శాతం ఎస్సి ఎస్టీ బీసీ, మైనారిటీ కార్పొరేషన్లలో కేటాయించాలని కోరుతున్నాము.2016వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతున్నాము అన్నారు.మండలంలో వికలాంగులను కించపరుస్తూ మాట్లాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జహీరాబాద్ మండల అధ్యక్షుడు ఎం రాజ్ కుమార్
అల్గోల్ మచ్చేందర్ బిస్మిల్లా శోభమ్మ వాజిద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!