*గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో మొదటి గ్రామ పంచాయతీ సమావేశం ఏర్పాటు*
*జహీరాబాద్ నేటి ధాత్రి:*
ఝరాసంగం మండల కేంద్రమైన పంచాయతీ ఎన్నికలలో ఝరాసంగం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో అధికారులు మొదటి గ్రామ పంచాయతీ సమావేశం ను ఏర్పాటు చేశారుఝరాసంగం మండల కేంద్రమైన పరిధిలోని గల గ్రామంలో బి. ఆర్. ఎస్ తరుపున గెలుపొందిన సర్పంచ్ వినోద బాలరాజ్ ఆధ్వర్యంలో అధికారులు మొదట గ్రామ పంచాయితీ సమావేశం ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వినోద బాలరాజ్ ను మరియు పంచాయతీ కార్యదర్శి వీరన్న పటేల్ ను సచివాలయ సిబ్బంది పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి గ్రామ సభను ప్రారంభించారు.ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి వీరన్న పటేల్ మాట్లాడుతూ సర్పంచ్,గ్రామ సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్ల సహకారంతో ఝరాసంగం గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అని తెలియజేశారు. గ్రామసభలో పారిశుద్ధ్యం వీధి దీపాలు తాగునీరు ఇతర సమస్యలపై గ్రామసభ నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో
ఉప సర్పంచ్ గడ్డం మమత అనిల్ పటేల్ వార్డ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు,
