
కోటగుళ్ళ లో ఘనంగా తొలి ఏకాదశి పూజలు
భారీగా తరలివచ్చిన భక్తులు
స్వామివారికి ప్రత్యేక అలంకరణ
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ఘనంగా పూజలు నిర్వహించారు. కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ఉదయం గణపతి, నందీశ్వరుడు, గణపేశ్వరునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించగా ఏడాది లో తొలి పండుగ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు నాగరాజు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.