
Engili Pula Bathukamma Celebrations in Mandamarri
ఎంగిలిపూల బతుకమ్మ మొదటిరోజు సంబరాలు
మందమర్రి నేటి ధాత్రి
బాలగణేష్ మండలి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి యపల్ ప్రాంతంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి
ఈ సందర్భముగా శ్రీమతి పట్టి సౌష్ణ, పంబాల సంతోషి, మారం మధులక్క, పిట్టల పవిత్ర, ముప్పు రాజేశ్వరి, కొమ్మ లక్ష్మి, గాదే సంధ్యారాణి, కట్ల లలిత, సుంకు పద్మ, బెడ్డల తార, దుగుట తిరుమల, సుజాత, రజిత, సరోజన గార్లు మాట్లాడుతూ ఈ సమయంలో వర్షాకాలం చివరి దశ, శీతా కాలం ప్రారంభం అవుతున్న వేళలో ప్రకృతి ఎంతో అందంగా ఉంటుందని, రమనీయమైన, కనువిందులు చేసే వివిధ రకాల పూలతో ప్రకృతి పులకిస్తుంది.
తెలంగాణాలో బతుకమ్మ పండుగ అనేది సాంప్రదాయ చిహ్నం. మహిళలు అందరూ కలిసి రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో అంటూ ఎంతో ఉత్సహంగా, ఘనంగా జరుపుకుంటారని తెలిపారు.పూలనే రాశి పోసి పూజించే గొప్ప సంకృతి మరెక్కడా లేదని, మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. బాల గణేష్ మండలి కమిటీ వారు బతుకమ్మ ఆడుటకు చాలా చక్కని ఏర్పాట్లు చేశారు.
అందుకు మహిళందరి తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నాము.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.