నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)
కమలా పూర్ మండలములో పదవతరగతి పరీక్షలు సోమవారం మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి.గతములో జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ,పోలీస్ శాఖ గట్టి భద్రత చర్యలు తీసుకుని పరీక్ష రాసే అభ్యర్థులను తప్ప ఇతరులని పరీక్ష సెంటర్ సమీపములో రాకుండా చర్యలు తీసుకున్నారు. ఇన్విజిలెటర్ తో పాటు అధికారుల సెల్ పోన్ లను కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు.మండల వ్యాప్తంగా నాలుగు కేంద్రాల్లో పదవ పరీక్షలు నిర్వహిస్తున్నారు.కమలా పూర్ బాలుర పాఠశాలలో 195మంది,బాలికల పాఠశాలలో 145మంది,శనిగరం పాఠశాలలో 99 మంది,మోడల్ స్కూల్ లో 180 మంది మొత్తం 614 మంది విద్యార్థులకు గాను 613 మంది పరీక్షకు హాజరై నట్లు తెలిసింది. శనిగరం పరీక్ష కేంద్రంలో 99 గాను 98 మంది మాత్రమే హాజరైయ్యారు. మండల వ్యాప్తంగా ఒక్క విద్యార్థి మాత్రమే పరీక్షకు హాజరు కాలేదు.