
*ప్రైవేట్ ఆస్పత్రులలో అగ్నిమాపక శాఖ అధికారుల తనిఖీలు*
*నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ హాస్పిటల్స్..*
*జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి శ్రీధర్ రెడ్డి*
*పావని నర్సింగ్ హోమ్, వీఎన్ఆర్ నర్సింగ్ హోమ్, మమతా హాస్పిటల్, మల్లికా హాస్పిటల్,దివ్యశ్రీ హాస్పిటల్ ల తనిఖీలు*
*నర్సంపేట,నేటిధాత్రి:*
నర్సంపేట పట్టణంలో గల ప్రైవేట్ ఆస్పత్రులకు అగ్నిమాపక శాఖ నుండి ఏలాంటి అనుమతుల్లేవని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు.వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో గల ప్రైవేట్ ఆస్పత్రులలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు ప్రైవేటు ఆసుపత్రులకు పర్మిషన్స్ లేకపోవడం వల్ల ఆయా ఆస్పత్రులపై జిల్లా అధికారులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి స్థానిక నర్సంపేట అగ్నిమాపక శాఖ అధికారితో కలిసి శనివారం నర్సంపేట పట్టణంలోని పావని నర్సింగ్ హోమ్, వీఎన్ఆర్ నర్సింగ్ హోమ్, మమతా హాస్పిటల్, మల్లికా హాస్పిటల్,దివ్యశ్రీ హాస్పిటల్ ల తనిఖీలలో తనిఖీలు చేసి సంబంధిత
ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారంగా ఆసుపత్రుల నిర్మాణాలను కొలతలు వేశారు. సెట్ బ్యాక్, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తక్షణ చర్యలకు అనుకూలంగా ఉన్నాయా లేదా అని విషయంలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ
రాష్ట్ర మొత్తం అగ్నిమాపక శాఖ ఒకే రకమైన నిబంధనలు ఉంటాయని తెలిపారు.జీవో 168 .. 2016 సంవత్సరం ప్రకారం
నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం అగ్నిమాపక శాఖ సంబంధిత సేఫ్టీ పట్ల పనిచేస్తామన్నారు.భవనాలు నిర్మాణాల పట్ల టౌన్ ప్లానింగ్ అధికారులతో శాఖకు ఎలాంటి సంబంధం ఉండదని వీల్చ చెప్పారు..మున్సిపాలిటీ,టౌన్ ప్లానింగ్ అనుమతులకు ముందు అగ్నిమాపక శాఖ నుండి ప్రొహిబిషన్ ఎన్ఓసి తీసుకోవాలి.నిర్మాణాలు చేపట్టే ముందు భవనం ప్లానింగ్ లో ఏమైనా తేడాలు ఉంటే ప్లాన్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది భవన నిర్మాణం పూర్తయిన తర్వాత నిబంధనల ప్రకారం సెట్ బ్యాక్ ఉంటే అక్యుపేన్సి ఎన్ఓసి సర్టిఫికెట్ ఇస్తామని పేర్కొన్నారు. సెట్ బ్యాక్ ప్రకారంగా భవనం పక్కన గల రోడ్డు తోటి ఎలాంటి సంబంధం ఉండదు .. భవనం చుట్టూ ఉన్న ప్రహరీ గోడల ప్రకారంగానే కొలతలు నిర్ధారణ చేస్తామని ఆయన వివరించారు.అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి లైసెన్సు అనుమతులు ఇవ్వలేదు వారి నుండి లైసెన్స్ ను పొందేవారికి ఎన్ఓసిలు ఇచ్చే అనుమతులు ఉండవన్నారు.
ప్రస్తుతం నర్సంపేట పట్టణంలో గల పావని నర్సింగ్ హోమ్, వీఎన్ఆర్ నర్సింగ్ హోమ్, మమతా హాస్పిటల్, మల్లికా హాస్పిటల్,దివ్యశ్రీ హాస్పిటల్ గల ఐదు ఆసుపత్రులలో ఫైర్ సేఫ్టీ పట్ల తనిఖీలు చేసి అందుకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని కోణంలో తనిఖీలు చేపట్టాము. ప్రభుత్వం నిబంధనల ప్రకారము ఏ ఒక్క ఆసుపత్రి కూడా లేవు. సెట్ బ్యాక్ లు లేవు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు లేవు. వీటికి అగ్నిమాపక శాఖ నుండి అనుమతులు రావని తేల్చిచెప్పారు.
కమర్షియల్ తో పాటుగా రెసిడెన్షియల్ గా కలిసి ఉండే భవనాలకు కూడా అనుమతులు ఉన్నా కూడా ఫైర్ సేఫ్టీ కోసం మాత్రమే పరిగణలోకి తీసుకొని నిబంధనల ఉంటేనే ఎన్ఓసి ఇస్తామని పేర్కొన్నారు. నర్సంపేట డివిజన్ పరిధిలో గల అన్ని ప్రైవేటు ఆసుపత్రుల ఫైర్ సేఫ్టీ పట్ల పూర్తిస్థాయిలో త్వరలో విచారణ చేస్తామని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు.