స్పందించి వెంటనే మంటలు అర్పిన ఫైర్ సిబ్బంది…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల సమీపంలో నీలగిరి చెట్లల్లో అకస్మాత్తుగా మంటలు చలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ తో పాటు వచ్చి మంటలు ఆర్పారు. స్థానికులు తెలిపిన ప్రకారం…. సింగరేణి పార్క్ వైపు నుండి మొదటగా మంటలు చెలరేగాయని,క్రమ క్రమంగా గురుకుల పాఠశాల వైపుకు రావడంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి తెలియచేయడం జరిగిందని అన్నారు. ఎండ తీవ్రతకు మంటలు చేలరేగాయా లేదా ఎవరైనా ఆకతాయిలు అగ్ని అంటించడం జరిగిందో తెలియడం లేదని అన్నారు. అగ్నిమాపక సిబ్బంది దేవేందర్, భీమయ్య, రవీందర్ ,నరేష్ లు మంటలను చాకచక్యంగా ఆర్పారు. ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూశారు.