
Fire at Metpally Market Yard Warehouse
మెట్ పల్లి ఆగస్టు 14 నేటి ధాత్రి
వ్యవసాయ మార్కెట్ కమిటి మెట్ పల్లి మార్కెట్ యార్డు నందు 2000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల నాన్-నాబార్డు గోదాము నందు అగ్ని ప్రమాదం జరిగినది. ఇట్టి అగ్ని ప్రమాదం నందు సివిల్ సప్లయిన్ వారి పాత గోనె సంచులు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలిసు శాఖ, రెనెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ మరియు వివిధ శాఖలకు సంబందించిన ఉద్యోగులు మరియు కార్మికులు మంటలను అదుపులోకి తేవడానికి సహాయ సహకారాలు అందించారు.
తదుపరి తెలియజేయునది ఏమనగా, వ్యవసాయ మార్కెట్ కమిటి మెట్ పల్లి అధ్యక్షులు కూన గోవర్ధన్ పైన తెలిపిన డిపార్ట్ మెంట్ వారు అందించిన సహాయ సహాకారాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..