Medical Store Fire Due to Short Circuit in Jammikunta
షార్ట్ సర్క్యూట్తో మెడికల్ స్టోర్లో అగ్ని ప్రమాదం
జమ్మికుంట ( నేటి ధాత్రి )
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం
పక్క వీధిలో గల శ్రీదేవి ఫార్మసీ మెడికల్ స్టోర్ లో శనివారం రోజున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మెడికల్ స్టోర్ లోని ఫ్రిడ్జ్ లో మంటలు చెలరేగి మెడికల్ స్టోర్ పూర్తిగా దగ్ధమైంది ప్రమాదం జరిగిన సమయంలో షాపు యజమాని జడల పండరి అందుబాటులో లేకపోవడం వల్ల ప్రక్కన నివసిస్తున్న వారు షాప్ యజమాని ఇంటి నుంచి మరో తాళపు చెవి తెప్పించి షాప్ తెరిచి ఎగసిపడుతున్న మంటలను బకెట్ల ద్వారా నీళ్లు చల్లి మంటలను అదుపు చేయడం జరిగింది

మెడికల్ స్టోర్ లో మందులు చాలా వరకు దగ్ధం కాగా మిగతా మందులు పనికిరాకుండా పోయాయి షాపులోని ఫర్నిచర్స్ పనికిరాకుండా పోయింది అగ్ని ప్రమాదం వల్ల జరిగిన నష్టం దాదాపు రెండు లక్షల వరకు ఉంటుంది అని అంటున్న షాప్ యజమాని.
