పరకాల పట్టణంలో అగ్నిప్రమాదాల అవగాహనా
కాలనీలలో అగ్నిప్రమాదాల గురించి వివరించిన ఫైర్ సిబ్బంది
పరకాల నేటిధాత్రి.
జాతీయ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా 17 ఏప్రిల్ రోజున పరకాల అగ్ని మాపక కేంద్ర అధికారి వక్కల భద్రయ్య ఎస్ఎఫ్ఓ మరియు సిబ్బంది ఎల్ఎఫ్ కృష్ణ కుమార్,ఎఫ్ఎం సత్యం,దిలీప్ డ్రైవర్ ఆపరేటర్ సత్తయ్య లు సౌందరయ్య హాస్పిటల్ లో అగ్ని ప్రమాదాల ముందస్తు జాగ్రత్తలు నివారణ చర్యల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హాస్పిటల్ ఫైర్ అయిన సందర్భంలో పేసెంట్ ప్రాణాలు కాపాడే పద్ధతులు,వృద్ధులు, చిన్న పిల్లలను ముందుగా ఏవిధంగా కాపాడి రక్షించాలి అనే మెలుకువల గురించి తెలియజేశారు.గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు, నివారణ చర్యలు,విద్యుత్ ప్రమాదాలు నివారణ చర్యలు,ఈత కు వెళ్లి ప్రమాదాలుకొని తెచ్చు కుంటున్నారని వాటి నివారణ చర్యల గురించి,వడగాలులు, విద్యుత్ ప్రమాదాలు నివారణ చర్యలు గురించి వివరంగా తెలియచేస్తూ అవగాహన కల్పించారు.

మాధారం కాలనిలో కాలానివాసులకు వివరించిన ఫైర్ సిబ్బంది
అగ్ని మాపక కేంద్ర అధికారి మరియు సిబ్బంది ఆధ్వర్యంలో మాదారం ఏరియాలోని ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణ చర్యల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు,నివారణ చర్యలు,విద్యుత్ ప్రమాదాలు నివారణ చర్యలు,చెరువులు, బావులలో ఈత సరదాకు వెళ్లి ప్రమాదాలుకొని తెచ్చు కుంటున్నారని,వడగాలులు, విద్యుత్ ప్రమాదాలు నివారణ చర్యలు గురించి వివరంగా తెలియచేస్తూ అవగాహన కల్పించారు.