Fire Accident Near Renjal Due to Short Circuit
రంజోల్ శివారులో విద్యుత్ షాక్ తో అగ్నిప్రమాదం, ఫర్నీచర్ దగ్ధం
జహీరాబాద్ నేటి ధాత్రి:
శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం రంజోల్ శివారులో 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన విద్యుత్ షాక్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఫర్నీచర్ దగ్ధమైనట్లు సమాచారం. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, నష్టాన్ని అధికారులు ఇంకా అంచనా వేస్తున్నారు. సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
