రేషన్ దుకాణాలకు సన్న బియ్యం పంపిణ చెయాలి.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి .
వనపర్తి నేటిదాత్రి :
శుక్రవారం, హైదరాబాద్ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్న బియ్యం సరఫరాపై తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు దొడ్డు బియ్యం తినడం ఆపేశారని, దీన్ని గమనించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న సోనామసూరీ బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. సన్న బియ్యం సరఫరా పంపిణీ విజయవంతం అవుతుందని, 84 శాతం జనాభా ఆహార భద్రతకు సుస్థిరత ఏర్పడిందన్నారు.
రేషన్ దుకాణాలకు సన్న బియ్యం సరఫరా రవాణాను వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. రవాణా కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి, సన్న బియ్యం రవాణాపై కలెక్టర్ లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు,కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు నిరు పేదలతో కలిసి ప్రభుత్వం సరఫరా చేస్తోన్న సన్న బియ్యంతో భోజనం చేయాలని మంత్రి సూచించారు అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా ప్రారంభించామని, దీనికి కృషి చేసిన అధికారులకు,సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సన్న బియ్యం పంపిణీ కారణంగా రేషన్ దుకాణాల వద్ద ఒకేసారి డిమాండ్ పెరిగిపోతున్నందున బియ్యం రవాణాను వేగవంతం చేయాలని, రేషన్ దుకాణాల వద్ద అవసరమైన మేర బియ్యం అందుబాటులో ఉండాలని సూచించారు. సంచుల కొరత ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకు రావాలని, సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
సన్న బియ్యం పంపిణీపై ప్రభుత్వ చిత్తశుద్ధి చాటేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.నూతన ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు .కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాలకు వేగంగా సన్న బియ్యం పంపిణీ చేయాలని సూచించారు. సన్న బియ్యం రవాణాను, నూతన ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలన్నా. రు సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల డిఎం జగన్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.