ప్రగతి సేవా సమితి మరిపెడ మండల కో ఆర్డినేటర్. ఐనాల పరశురాములు
మరిపెడ నేటి ధాత్రి.
పొదుపు సంఘాలతోనే ఆర్ధిక వెసులుబాటుకలిగి అభివృద్ధి చెందుతారని ప్రగతి సేవా సమితి మరిపెడ మండల కో ఆర్డినేటర్ ఐనాల పరశు రాములు అన్నారు.సోమవారం మరిపెడ మున్సిపాలిటీ లోని లోక్యతండ,మండలంలోని పురుషోతామాయగూడెం గ్రామాల్లో ప్రగతి సేవాసమితి ఆద్వర్యంలో ఆర్ధిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్భగా ఐనాల పరశు రాములు మాట్లాడుతూ మహిళలు, రైతులు, కార్మికులు, వివిధ రంగాల్లో పనిచేసే వారు వయసు, కుల, లింగ బేధం లేకుండా ప్రతి ఒక్కరు పొదుపు సంఘాలుగా ఏర్పడి పొదుపు చేసుకొని ప్రస్తుత పరిస్థితులకు అనగుణంగా ఆర్ధిక వెసులు బాటు కల్పించుకొని అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా కో ఆర్డినేటర్ జిన్న లచ్చయ్య,మరిపెడ టౌన్ కో ఆర్డినేటర్ బాణోత్ సరిత, పురుషోత్తమాయగూడెం గ్రామ కో ఆర్డినేటర్ దాట్ల రమ, పొదుపు సంఘాల సభ్యులు ఎల్లయ్య, పానుగోత్ దేవి, యాకమ్మ,మంగమ్మ తదితరులు పాల్గోన్నారు.