మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
నిజాంపేట , నేటి ధాత్రి
మండల కేంద్రానికి చెందిన మాసుల బాలయ్య 65 మృతి చెందగా వారి ఇట్టి విషయాన్ని బి ఆర్ ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంటారెడ్డి తిరుపతిరెడ్డి కి తెలియజేయగా వెంటనే స్పందించి వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని పార్టీ కార్యకర్తల చేత అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు చలిమేటి నాగరాజు, మండల యూత్ అధ్యక్షులు మావురం రాజు, తాడెం మల్లేశం, మాసుల శివ, మాసుల నరసింహులు, శ్రీకాంత్, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.