Financial Aid to Deceased Congress Worker’s Family in Jaipur
పార్టీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బొల్లంపల్లి భూమయ్య ఇటీవల కాలంలో మృతి చెందారు.బుధవారం దశదినకర్మ సందర్బంగా గ్రామ సర్పంచ్ డేగ స్వప్న-నగేష్ పటేల్ వారి కుటుంబాన్ని పరామర్శించి,మనోధైర్యాన్ని చెప్పి,కుటుంబ ఆర్థిక స్థితిగతుల గురించి వివరాలు తెలుసుకుని వారికి 25 కిలోల బియ్యం,5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు.అంతేకాకుండా ఎల్లవేళలా అన్ని విధాల భూమయ్య కుటుంబానికి తోడుగా ఉంటామని సర్పంచ్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్,వార్డు సభ్యులు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
