
చిట్యాల, నేటిధాత్రి :
అభిమానం అంటే ఫోటోలు తీసుకోవడం ,టాటూలు వేసుకోవడం ,సెల్ఫీలు దిగడం ప్రస్తుత సమాజంలో మనమంతా చూస్తూనే ఉన్నాం.. కానీ భూపాలపల్లి నియోజకవర్గంలో చల్లగరిగా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది యువకులు తమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి గండ్ర సత్యనారాయణ రావు* మీద అభిమానంతో ఒక సైన్యంగా ఏర్పడి తమ అభిమానాన్ని వినూత్నంగా తెలియజేశారు..
చల్లగరిగా గ్రామంలో ఇటీవల మరణించిన *బొంకూరి అయిలయ్య కుటుంబమును నూతనముగా ఏర్పాటైనటువంటి గండ్ర సత్తన్న సైన్యం చల్లగరిగ కమిటి సభ్యులు 17 మంది బొంకూరి అయిలయ్య కుమారుడు బొంకూరి రమేష్‌ని మరియు వారి కుటుంబ సభ్యులందరినీ కలిసి పరామర్శించి వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి 5016 రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది..”పరిపాలనలో తనకంటూ ఒక మార్కుని సెట్ చేయాలని అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న ఎమ్మెల్యే గారి అడుగుజాడల్లో వారంతా నడుస్తారని మరియు గ్రామంలో ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు చేపడతారని తెలియజేశారు…”
*ఇట్టి కార్యక్రమంలో సత్తన్న సైన్యం చల్లగరిగ కమిటి సభ్యులు అల్లె నాగరాజు , నంబుల రంజిత్, దూదిపాల వాసుదేవ రెడ్డి, దూదిపాల లక్ష్మణ్ రెడ్డి, సిరిపెల్లి నరేష్, మామిడి అనిల్, మేకల రమేష్, సంగ రమేష్, గువ్వ శ్రీకాంత్, దూడపాక శ్రీనివాస్, దూదిపాల మహేందర్ రెడ్డి, తొన్గర్ విక్రమ్ సింగ్, కట్ల మహేష్, బాలగోని నాగార్జున, గొల్లపెల్లి కిరణ్ పాల్గొన్నారు..