నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని రాయపర్తి గ్రామానికి చెందిన ఆర్ యం పి వైద్యుడు, మండల కోశాధికారి మార్త సురేష్ తండ్రి మార్త రాజయ్య (68) అనారోగ్యం తో మృతిచెందగా, మృతుడికి తెలంగాణ రాష్ట్ర ఆర్ యం పి, పి యం పి వెల్ఫేర్ అసోసియేషన్ నడికూడ మండల అధ్యక్షులు పాశికంటి రమేష్ పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు,తోటి మిత్రుడికి మండల కమిటీ తరఫున 5 వేల రూ.లు ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా ఇంచార్జ్ ఓరుగంటి రమేష్, మండల ప్రధాన కార్యదర్శి బెజ్జంకి రాజేందర్, తోటి వైద్య మిత్రులు మామిడాల వెంకట్రాజం, మాచ బోయిన రామస్వామి,బాణాల వీరస్వామి, వంగర రమేష్,వంగర రాజు, చేపూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆర్ యం పి మిత్రుడికి ఆర్థిక సాయం
