చిట్యాల, నేటిధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చల్లగరిగ గ్రామానికి చెందిన కోడెపాక రమేష్ కు మాజీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారి ఆర్థిక సహాయాన్ని పంపించగా దాన్ని బుధవారం రమేష్ కు బీ ఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఇటీవల చల్లగరిగ గ్రామానికి వచ్చిన సమయంలో ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న మధుసూదన చారి రమేష్ ఇంటికి వెళ్లి పరామర్శించి ఓదార్చారు. ఆసుపత్రి విషయంలో అన్ని విధాల సహకరిస్తానని అధైర్యపడవద్దనిఆయన అన్నారు. పార్టీ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చిన అందుబాటులో ఉండడంతో పాటు అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ఎస్ పార్టీ జిల్లా, మండల నాయకులు చింతల రమేష్ ముదిరాజ్,జెన్న యుగంధర్ గొల్లపల్లి రాజు చంద్రమౌళి ఎల్ఐసి కుమార్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.