
Udayam Foundation.
ఆనారోగ్య మహిళకు ఆర్థిక సహాయం–ఉదయం ఫౌండేషన్
రాయికల్ , జూలై 23, నేటి ధాత్రి:
మండలం అయోధ్య గ్రామానికి చెందిన తునికి జల (42) గత కొన్ని నెలలుగా షుగర్ మరియు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ టాబ్లెట్స్ తీసుకుంటుంది.భర్త రాజేశం 6 సంవత్సరాల క్రితం మరణించాడు. వీరిది నిరుపేద కుటుంబం. రేకుల షెడ్ లో ఉంటూ బీడీలు చుడుతూ జీవనం సాగిస్తోంది. అనారోగ్యం కారణంగా గత కొన్ని నెలల నుండి బీడీలు మానేసి మంచం పట్టి , హాస్పిటల్ కి వెళ్ళదామంటే డబ్బులు లేక ఉదయం ఫౌండేషన్ సంప్రదించాగా ఈ రోజు 5000 వేల రూపాయల ఆర్థిక సహాయన్నీ అందించారు.ఈ కార్యక్రమంలో పంచతి నరేష్, బాలరాజు, రాజేందర్, రాజశేఖర్, మహమ్మద్ అస్లాం, తోట రాజేష్ లు పాల్గొన్నారు.