
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదానికి గురై, తీవ్ర గాయాలు పాలై హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ పత్రిక విలేకరి మామిడి మాడ తిరుపతయ్య ను బిజెపి రాష్ట్ర కోశాధికారి, బండారి శాంత కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తిరుపతయ్య వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
రోడ్డు ప్రమాదానికి గురైన విషయాన్ని బాధితున్ని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకొని ఫోన్ పే ద్వారా ఆర్థిక సహాయం చేశారు. త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.