స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

శాయంపేట నేటి ధాత్రి:

హనుమకొండ జిల్లాశాయంపేట మండల కేంద్రంలోని 1999-2000 పదవ తరగతి బ్యాచ్ కి చెందిన తమ తోటి స్నేహితుడు మాచర్ల శ్రీనివాస్ అనారోగ్య కారణాల వలన మృతి చెందగా తమ తోటి స్నేహితులు 38,000/- రూపాయలను శ్రీనివాస్ కూతురు నేహా పేరు మీద పోస్టాఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి డిపాజిట్ బాండును శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కందగట్ల సంతోష్,మార్త సుమన్, బాసని రవి, గుండు రాము, మార్త శ్రీనివాస్, బాసాని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!