కల్వకుర్తి/నేటి ధాత్రి
కల్వకుర్తి నియోజకవర్గం లోని తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన శైలజ హైదరాబాదులోని బి.ఎన్.రెడ్డి శ్రీకృష్ణవేణి కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. శైలజ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను తెలుసుకొని తలకొండపల్లి మాజీ జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ తన అనుచరుడు ఆంజనేయులు మంగళవారం రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని శైలజకు అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పవన్, బుచ్చిబాబు, మల్లేష్, సంపత్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.