
Financial assistance
పార్కు వాచ్ మెన్ కు 15000 రూపాయలు ఆర్థిక సహాయం
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని జయశంకర్ పార్క్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న దంపతులకు జయశంకర్ వాకర్స్ అసోసియేషన్ వారు 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాచ్మెన్ గా పనిచేస్తున్న వారి భార్య అనారోగ్యానికి గురి కావడం జరిగింది డబ్బులు లేక ఇబ్బందులకు గురైంది విషయం తెలుసుకున్న వాకర్స్ అసోసియేషన్ 15000 ఆర్థిక సాయం చేయడం జరిగింది వీరిని పలువురు అభినందించారు
ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రొడ్డ రవీందర్ కార్యదర్శి కోల తిరుపతి గౌడ్ ఉపాధ్యక్షుడు కె రాజు గౌరవాధ్యక్షులు బిల్ల రాజిరెడ్డి సతీష్ రాజేందర్ భీమయ్య తదితరులు పాల్గొన్నారు