
చందుర్తి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన బంటు ఆనందం అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించగా గత నాలుగు రోజుల క్రితం మృతి చెందాడు, విషయం తెలుసుకున్న దుబాయిలో ఉపాధి నిమిత్తం పనిచేస్తున్నటువంటి మల్యాల గ్రామానికి చెందిన కార్మికులు ఒక గ్రూపుగా ఏర్పడి నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయంగా పదిహేను వేల రూపాయలు పంపించడం జరిగింది.
క్వింటాలు బియ్యం వితరణ
దుబాయ్ లోనే పనిచేస్తున్నటువంటి అదే గ్రూపుకు చెందిన తొమ్మిది మంది, వారికి క్వింటాల్ బియ్యం అందజేశారు, వారు మర్రి అంజయ్య, నేదూరి బాబు, గడ్డమీద భూమయ్య, అడ్డగట్ల లక్ష్మణ్, రొండి కిషన్, బండపల్లి దేవయ్య, తూమ్ దేవేంద్రం, పులి పరుశరాం, పాటి శ్రీనివాస్ లు ఉన్నారు, ఈ కార్యక్రమంలో మాందాల అబ్రహం, మాదం బాబు, లోకోజి సతీష్, గొర్రె నందు, బండపల్లి వినీత్, కొడగంటి గంగాధర్, మూడపల్లి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుని కుటుంబం చాలా బీద స్థితికి చెందిన వారని, వారికి ఇంకా దాతలు ఎవరైనా ఉంటే సహాయం చేయగలరని కోరుకున్నారు. మృతుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ దుబాయ్ గ్రూపు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు చేసిన మేలుని మరిచిపోమని తెలియజేశారు.