
మల్కాజిగిరి,నేటిధాత్రి:
మల్కాజిగిరి నియోజకవర్గం మౌలాలి డివిజన్ శ్రామిక నగర్ కి చెందిన 10వ తరగతి భాష్యం పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థి కు మానవసేవే మాధవసేవ వాట్సాప్ గ్రూప్ ప్రతినిధులు 20వేల ఫీజు కట్టి ఆర్థిక సహాయం అందజేశారు అండగా నిలిచారు.మౌలాలి శ్రామిక నగర్ లో నివాసముండే అబ్దుల్ ఖయ్యూం దంపతుల కుమారుడు ఆతిఫ్ చదువులో ఉత్తీర్ణత ఉన్న ఆతిఫ్ ఫీజు కట్టడానికి స్తోమత లేక తల్లిదండ్రులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు.సదరు విషయం తెలుసుకున్న మానవసేవే మాధవసేవ వాట్సాప్ గ్రూప్ ప్రతినిధులు అడ్మిన్ కుమ్మరి రాజు గ్రూప్ సభ్యుల సహాయంతో 20వేల ఫీజును పాఠశాల ప్రిన్సిపల్ అమరేశ్వర రావుకు మంగళవారం 20వేల చెక్కును అందజేశారు.అదేవిధంగా ఆతీఫ్ పైచదువులు ఇంటర్మీడియట్ చదువు బాధ్యత కూడా తామే తీసుకుంటామని వాట్సాప్ గ్రూప్ ప్రతినిధులు హామీ ఇచ్చారు,దీంతో ఆతిఫ్ తల్లిదండ్రులు మానవసేవే మాధవ సేవ వాట్సాప్ గ్రూప్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ కుమ్మరి రాజు, అహమద్ అలీ ఖాన్, అబ్దుల్ రెహమాన్, వెంకటరమణ,తుపాకుల రమేష్ , సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.