భూపాలపల్లి నేటిధాత్రి
భూమి భుక్తి విముక్తి కోసం పోరాడి తెలంగాణలో తొలి పోరాట నిర్వహించిన చాకలి ఐలమ్మ మరణం నేటి తరానికి ఆదర్శం కావాలని తెలంగాణ గోదావరి కార్మిక సంఘం టిజిఎల్బి కేస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రగిరి శంకర్ అన్నారు.
భూపాలపల్లి లో ఈరోజు చాకలి ఐలమ్మ 39 వ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయన ప్రసంగించారు.
చాకలి ఐలమ్మ ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తిలో జన్మించి దేశముక్కు పోలీస్ పట్వార్లకు వ్యతిరేకంగా విరోచత పోరాటాల నిర్వహించి దొర అనే పిలుపుకు చరమగీతం పాడిన వారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నదని ఆయన అన్నారు. నాటి ధరలు పటేల్ పట్వారిలు ఏకమై ప్రజల భూమిని గుంజుకొని వారి సొంత ఆస్తులుగా రాపించుకొని పండించిన పంటను మొత్తం తోలుకొని పోతుంటే ఏమి చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలకు ఆమె ఒక ఆయుధమై నిలిచిందని తిరుగుబాటు మొదలుపెట్టిందని ధరలు పటేళ్లు పట్వారిలో వ్యతిరేకంగా పోరాడి ప్రజలకు భూమిని పండించిన ధాన్యాన్ని ప్రజలకు అప్పచెప్పిందని ఆయన అన్నారు. తెలంగాణ పోరాటంలో తొలి మహిళ సాకలి ఐలమ్మనని ఆయన కొనియాడారు. పోలీసు పట్వారి పటేల్ ఏకమై భూములను తమ సొంత హక్కులుగా రాపించుకుంటున్న తరుణంలో నా ప్రాణం పోతినే ఈ పంట భూమి మీకు వస్తాయని రోకలిబండ చేత బోని పోరాటం నిర్వహించి విజయం సాధించిందని ఆయన అన్నారు. కళ్ళ ముందే కుటుంబాన్ని ఇండ్లని ధ్వంసం చేసిన కూతుర్ని అత్యాచారం చేసిన గుండె ధైర్యంతో ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తావురా దేశముఖ్ ప్రశ్నతో ముందుకు సాగినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ అని ఆయన అన్నారు ఆమె చనిపోయి 39 సంవత్సరాలు అవుతున్న ఆమె పోరాటాలు ఆమె ఆశయాలు ఇంకా మన కళ్ళముందే ఉన్నాయని ఆమె ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు పోరాడాలని ఆయన అన్నారు.