హన్మకొండ జిల్లా బార్ అసోసియేషన్ ఎలక్షన్ లో హోరాహోరీ పోటీ:-
స్వల్ప మెజారిటీతో గట్టెక్కేనా పులి సత్యనారాయణ:-
హన్మకొండ, నేటిధాత్రి (లీగల్):-
హన్మకొండ జిల్లా బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ శుక్రవారం రోజున రసవత్తరంగా ముగిసాయి. అధ్యక్షునిగా తన గెలుపు నల్లేరు మీద నడకే అని భావించిన పులి సత్యనారాయణను తన ప్రత్యర్థి మొలుగూరి రంజిత్ ముప్పుతిప్పలు పెట్టాడు, కేవలం 26 ఓట్ల మెజారిటీ తో పులి సత్యనారాయణ హన్మకొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా గెలుపొందారు.

హన్మకొండ బార్ అసోసియేషన్ లో 867 ఓట్లకు గాను 752 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఇందులో పులి సత్యనారాయణకు 336 ఓట్లు రాగా తన సమీప అభ్యర్తి మొలుగూరి రంజిత్ కు 310 ఓట్లు వచ్చాయి. అలాగే ప్రధాన కార్యదర్శి గా కొత్త రవి ఎన్నికయ్యారు. ఇతను తన సమీప అభ్యర్థి అయిన వి. నరేందర్ పై 109 ఓట్ల మెజారీతో గెలుపొందారు. అలాగే ఉపాధ్యక్షులుగా చిర్ర రమేష్ బాబు గెలుపొందారు. సంయుక్త కార్యదర్శిగా అంబేద్కర్, లైబ్రరీ సెక్రటరీ గా వెంకటేష్, స్పోర్ట్స్ సెక్రటరీ గా మల్లేష్, ట్రెస్సరర్ గా సాంబశివ రావు, 30 సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా రాజేశ్వర్, 20 సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ అశీర్వాదం, మరియు మహిళా సంయుక్త కార్యదర్శిగా నాగేంద్ర, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా శివకుమార్, సునీల్ కుమార్, కమలాకర్, నిఖిల్, మరియు మహిళా ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా వేద, స్వాతి గెలుపొందారు. కొత్తగా ఎన్నికైన వారికి పలువురు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.
వరంగల్
————–
అలాగే వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా వలస సుదీర్ మరియు ప్రధాన కార్యదర్శిగా డి.రమాకాంత్ ఎన్నికైనారు, వీరిని వరంగల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఘనంగా సత్కరించి తమ శుభాకాంక్షలు తెలిపారు.