ఈశ’తో రైతుకు అధిక దిగుబడులు
రీజినల్ మేనేజర్ నరేష్ కుమార్
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం పెద్దకోడేపాక గ్రామ రైతులతో క్షేత్ర పర్యటన, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈషా అగ్రి సీడ్ హైదరాబాద్ వాసి రైతులు అధిక దిగు బడును తెలంగాణ డిజిటల్ మేనేజర్ నరేష్ కుమార్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ భగవతి యజమాని అని అమ్మ జగన్ తెలిపారు.కొంతమంది రైతులు ఈశ 5186 రకం మిర్చి తోటను పెట్టి ఎకరానికి 40 క్వింటాళ్లు మిర్చి పండించినట్లు తెలిపారు. అన్ని రకాల అంటువ్యాధులను తట్టుకునే శక్తి ఈ సీడ్ కు ఉన్నట్లు తెలిపారు. ఏపుగా మొక్కలు పెరిగి, మిర్చి కాయలు అధికంగా కాస్తాయని స్పష్టం చేశారు. రైతులు ఒక్కసారి ఈ సీడును గనుక వాడి చూస్తే మర్చిపోలేరని తెలిపారు. వేరే మిర్చి నారుమల్లకు మా కంపెనీ నారుమల్లకు తేడా చూసుకోవచ్చని తెలిపారు. పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువ ఆర్జించవచ్చని స్పష్టం చేశారు. దాదాపుగా అన్ని గ్రామాలలో ఈశ 5186 రకం వాడుతున్నట్లు తెలిపారు. కారం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కాయ సైజు పెద్దవిగా కాస్తాయని తెలిపారు. మార్కెట్లో మంచి రేటు కూడా ఉందని అన్నారు. కావలసిన రైతులు కామారెడ్డి పల్లి లోని సాయి చరణ్ హైబ్రిడ్ నర్సరీ నుండి ఈ రకం మిర్చి నారుమల్లను తీసుకోవచ్చని తెలిపారు. ఈకార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు కొమురయ్య, ఎల్లబోయిన స్వామి, నర్సరీ ప్రతినిధులు సుధాకర్, దాదాపు 400 మంది రైతులు పాల్గొన్నారు.