పరకాల నేటిధాత్రి(టౌన్)
హనుమకొండ జిల్లా పరకాల పట్టణం లోని ఒకటో వార్డు సి.ఎస్.ఐ మిషన్ కాంపౌండ్ లో గల సమాధుల తోటలో నవంబర్ 2 వ తేదీన జరుపుకోబోయే సమాధుల పండుగను పురస్కరించుకొని మునిసిపల్ సిబ్బంది చేత పరిసరాలను కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ శుభ్రం చేయించడం జరిగింది. వారు మాట్లాడుతూ పెద్దల సమాధులను శుభ్రం చేసి క్యాండిల్స్ వెలిగించి పూలమాలలు వేసి,పెద్దలను కుటుంబ సభ్యులు అందరూ హాజరై స్మరించుకుంటారని అన్నారు.దూర ప్రాంతాలలో ఉన్న కుటుంబ సభ్యులందరూ హాజరవుతారని తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఫాస్ట్రేట్ చైర్మన్ రెవరెండ్ వై. జాన్ అయ్యగారు,మున్సిపల్ అధికారి గంజి వెంకటరెడ్డి, జవాన్లు సతీష్ ,మారుపట్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.