
Congress leaders
జహీరాబాద్ నియోజకవర్గంలో ఎరువుల కొరత
◆:- మళ్లీ పాత రోజులు గుర్తు చేసుకుంటున్న రైతులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు ఎరువుల కోసం రైతులు ఉదయం నుండి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తూ ఒక రైతుకు రెండు బస్తాల ఎరువు ఇస్తే రైతులు పంటలు ఎలా పండిస్తారు ఎరువుల కొరత లేదు అని చెప్పే అధికారులు మరియు కాంగ్రెస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్రం రాక ముందు కాంగ్రెస్ అధికారంలో ఉంది అప్పుడు కూడా ఎరువుల బస్తాల కోసం రైతులు పోలీస్ స్టేషన్ లో టోకెన్ తీసుకొని చెప్పులు క్యూ లైన్లో పెట్టి చిమ్మ చీకటిలో పక్కన నిద్రపోయే వారు ఇప్పుడు మళ్ళీ అవే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.