
ఎరువుల డీలర్లు ప్రతి రైతుకు విధిగా బిల్లులు ఇవ్వాలి
ఎవరైనా డీలర్లు బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడితే చట్టపరమైన చర్యలు
మండల వ్యవసాయ అధికారి…. బి వెంకన్న
కేసముద్రం/ నేటి ధాత్రి
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్, మరియు జిల్లా వ్యవసాయ అధికారి మహబూబాబాద్ ఆదేశాల మేరకు, శనివారం కేసముద్రం మండలంలోని పలు ఎరువుల దుకాణాలు, మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను, ఆగ్రో రైతు సేవ కేంద్రాలను కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న, మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు తనిఖీలు చేయడం జరిగింది, పలు దుకాణాలలో వారు యూరియా నిలువలు, లైసెన్స్, పి ఓ ఎస్ మిషన్ బ్యాలెన్స్ మరియు, స్టాక్ బోర్డు, స్టాక్ రిజిస్టర్ బ్యాలెన్స్, గోదాం బ్యాలెన్స్ తనిఖీలు చేయడం జరిగింది.
కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న మాట్లాడుతూ, కేసముద్రం మండలంలోని ఎరువుల డీలర్లు, ప్రాపర్ గా, స్టాక్ బోర్డు మరియు, గోదాం బ్యాలెన్స్,స్టాక్ రిజిస్టర్ బ్యాలెన్స్, పి ఓ ఎస్ బ్యాలెన్స్ మెషిన్ తో సమానంగా ఉండేటట్లుగా ప్రతిరోజు అప్డేట్ చేసుకోవాలని వారు సూచించారు, ఎరువుల డీలర్లు ప్రతి రైతుకు విధిగా బిల్లులు ఇవ్వాలని, బిల్లుల మీద రైతు సంతకాలు తీసుకోవాలని, ఎవరైనా డీలరు బ్లాక్ మార్కెటింగ్ పాల్పడిన, అధిక ధరలకు విక్రయించిన, నిత్యావసర వస్తువుల చట్టం 1955 మరియ ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు సూచించారు. అదేవిధంగా రైతులు ఆధార్ కార్డు మరియు పట్టాదార్ పాస్ బుక్ జిరాక్స్ నకలు ను తీసుకువెళ్లి యూరియా మరియు ఇతర ఎరువులను కొనుగోలు చేయాలని వారు సూచించారు.
అదేవిధంగా నానో యూరియా వాడకాన్ని రైతులు అలవాటు చేసుకోవాలని, అది కూడా గ్రాన్యూలార్ యూరియా వలె పని చేస్తుందని, వారు తెలిపారు.
కేసముద్రం మండలంలో యూరియా నిల్వలు 389 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని, 1) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవ కేంద్రాల వద్ద 210 మెట్రిక్ టన్నులు, 2) ప్రవేట్ దుకాణాల వద్ద 179 మెట్రిక్ టన్నులు యూరియా రైతులకు అందుబాటులో ఉన్నందున రైతులు ఎవరు ఆందోళన చెందువద్దని, విడతలవారీగా మండలానికి యూరియా వస్తున్నందున రైతులు పత్తి, మొక్కజొన్న మరియు ఇతర పంటలకు మోతాదులో మాత్రమే వినియోగించాలని వారు సూచించారు, ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న మరియు ఆయా క్లస్టర్ల వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.