ఎన్ పద్మ
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల సంక్షేమ సొసైటీలోని టీజీటీ పీజీటీ జూనియర్ లెక్చరర్స్ మరియు డిగ్రీ కళాశాల లెక్చరర్స్ ల ఉద్యోగాల నియామకాలకు 2023 లో నోటిఫికేషన్ విడుదల చేయడం అదే సంవత్సరం ఆగస్టులో ఒక నెలపాటు పరీక్షలు నిర్వహించారు. కొన్ని అనివార్య కారణాల వలన అప్పుడు రిజల్ట్స్ ప్రకటించలేక పోయారు కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ సొసైటీ మీద ఉన్న కేసులు అన్నిటిని ఛేదించుకొని ఫైనల్ ఫలితాలను 2024 ఫిబ్రవరి మాసంలో ప్రకటించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు పొందారు. దాదాపు 9200 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. హనుమకొండలోని ఫెర్మాట్ ఎడ్యుకేషనల్ అకాడమీ గణిత కోచింగ్ సెంటర్ ద్వారా శిక్షణ తీసుకున్న విద్యార్థుల్లో దాదాపు 80 మంది పిజిటి జేఎల్ మరియు డిఎల్ ఉద్యోగాలు సాధించినట్లు అకాడమీ డైరెక్టర్ శైలజ. జి తెలిపారు. శుక్రవారం హనుమకొండలోని ఫెర్మాట్ అకాడమీలో ఏర్పాటుచేసిన సమావేశంలో అకాడమీ చైర్మన్ డాక్టర్ టి నాగయ్య మాట్లాడారు. పిజిటిలొ రాష్ట్రస్థాయి 3,5,6,8,9 ర్యాంక్స్ జెఎల్ 4, 5,8,9 రాంక్స్ తో పాటు దాదాపు 40 మంది ఉద్యోగాలు సాధించారు. అదే విధంగా డీల్ లో రాష్ట్రస్థాయి ర్యాంకులను సాధించడంతో పాటు 10 మంది ఉద్యోగాలు సాధించారని అన్నారు. రాజధానికి సుదూర ప్రాంతంలో ఉండి డైరెక్ట్ గా ఆఫ్లైన్లో శిక్షణ తీసుకోలేని వారికి, విద్యార్థులకు, గృహిణులకు మరియు ప్రస్తుతం ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఇది ఒక సువర్ణ అవకాశంగా ఉపయోగపడింది అన్నారు. అకాడమీలో శిక్షణ పొందిన అనీష్, జ్యోతి, మౌనిక, నాగరాజు ఒకే సారి నాలుగు ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మెగా డీఎస్సీ కోసం కూడా అభ్యర్థులకు ఆన్లైన్లో శిక్షణ ఇస్తారని చెప్పారు. ఒక్కరే కాకుండా సుదీర్ఘ బోధన అనుభవం కలిగి ఉండి నిష్ణాతులైన 6 గురు అధ్యాపకులతో బోధించడంతో పాటు విద్యార్థులకు ఆన్లైన్లో మోడల్ టెస్టులు యాప్ ద్వారా నిర్వహించడంతో పాటు మార్కులను విశ్లేషణ చేయడం వలన స్థాపించిన రెండవ సంవత్సరమే ఇంత మంచి ఫలితాలు ఇచ్చామని అన్నారు. గణిత పరీక్ష ఏదైనా ఫలితాలు ఇవ్వడంలో ఫెర్మాట్ అకాడమీ ముందుంటుందని అన్నారు.
ఆర్ జ్యోతి
శివ ప్రసాద్
G. Tirumala
డీ అనీష్