
విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
సోతుకు.ప్రవీణ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి పట్టణంలోని స్థానిక కొమురయ్య భవన్ లో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోతుకు.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రన చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలలో ఈ సంవత్సరం ఒక్కొక్క తరగతికి 4000 రూపాయల ఫీజులను పెంచారని అన్నారు. పేరెంట్స్ కమిటీ తీర్మానం లేకుండా, విద్యాశాఖ అధికారులకు తెలియకుండా విచ్చలవిడిగా ఎల్ కే జి నుండి పదవ తరగతి వరకు ఫీజులను పెంచడం జరిగిందన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి పాఠశాలలో బుక్స్ అమ్మడం జరుగుతుందని అన్నారు. వెయ్యి రూపాయలకు అందుబాటులో దొరికే పుస్తకాలకు ఎనిమిది వేల రూపాయలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు.వెంటనే జిల్లా విద్యా శాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు. పెంచిన ఫీజులను తగ్గించకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో తనిఖీలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్, మాతంగి దిలీప్,ఇందరపు అరవింద్, కళ్యాణ్ రక్షిత, స్వరూప తదితరులు పాల్గొన్నారు.