పోలీసుల సేవలపై అభిప్రాయాల సేకరణ
పోలీస్ స్టేషన్లో ఏర్పాటుకు చర్యలు
జనవరి 9 న రాష్ట్ర డి.జి.పి కార్యాలయం నుండి ప్రారంభం
ప్రకటనలో వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ మరియు నిజామాబాద్ ఇన్చార్జి సీపీ సింధు శర్మ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి నేటి ధాత్రి:
పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల వారి నుంచి అభిప్రాయాలు తీసుకుని ప్రజలకు చేరవయ్యేందుకు, తమ పని తీరును మరింత మెరుగు పరుచుకునేందుకు పోలీసు అధికారులు సిద్ధమయ్యారు. పోలీస్ స్టేషన్కు వచ్చేవారు తమ మొబైల్ ద్వారా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన వెంటనే పోలీసు సేవల పట్ల ఎంతవరకు సంతృప్తి చెందారు? పోలీసుల పని తీరుపై ఫిర్యాదుదారుల నుం చి అభిప్రాయాల సేకరణ చేయనున్నారు.నిజామాబాద్ పోలీస్ కమీషరేటు పరిధి లోని అన్ని పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు దారుల సం బంధించి వారి ఫిర్యాదుల పట్ల సంబంధిత పోలీస్ సిబ్బంది స్పందించిన తీరు, పోలీస్ సిబ్బంది పట్ల ప్రజలు ఏ విధంగా తమ అభిప్రాయం తెలియజేయాలనుకుంటున్నరో అందుకోసం క్యూఆర్ కోడ్ ని ఏర్పాటు చేయనున్నారు.
ఈ క్యూఆర్ కోడ్ పద్దతిని తెలం గాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవ రి 9 న రాష్ట్ర డి.జి.పి కార్యా లయం నుండి ప్రారంభించ నున్నట్లు బుధవారం ఇంచార్జ్ సిపి సిహెచ్. సింధు శర్మ ఓ ప్రకట నలో వెల్లడించారు. ఈ క్యూఆర్ వలన పోలీసుల గురించి ప్రజల నుండి వారి అభిప్రాయాలను సేకరించడం కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారని. ఈ క్యూ ఆర్ కోడ్ పోస్టర్లు జనరద్దీ గల ప్రదే శాలలో ఏర్పాటు చేయ డం జరుగుతుందన్నారు. ప్రజలు క్యూ ఆర్ కోడ్ సౌకర్యాన్ని సద్వి నియోగం చేసుకోవా లని కామారెడ్డి ఎస్పి, నిజామాబాద్ ఇన్చార్జి సిపి కోరారు.