
Team India batter Pratika Rawal
ఫీజులో కోత.. ఓ డీమెరిట్ పాయింట్
ఇంగ్లండ్ మహిళలతో తొలి వన్డేలో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను టీమిండియా బ్యాటర్ ప్రతికా రావల్‌కు జరిమానా విధించారు.
ప్రతికా రావల్‌కు జరిమానా
దుబాయ్: ఇంగ్లండ్ మహిళలతో తొలి వన్డేలో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను టీమిండియా బ్యాటర్ ప్రతికా రావల్‌కు జరిమానా విధించారు. భారత ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ప్రతిక.. సింగిల్ తీసే క్రమంలో ప్రత్యర్థి బౌలర్ లారెన్ ఫిలర్‌ను ఢీకొట్టింది. అంతేగాకుండా తర్వాతి ఓవర్లో తాను అవుటవగానే ప్రతిక.. మరో బౌలర్ సోఫీ ఎకెల్‌స్టోన్‌తో వాగ్వాదానికి దిగింది. దీంతో లెవెల్ 1 తప్పిదం కింద ప్రతికకు మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధించడంతో పాటు ఓ డీ మెరిట్ పాయింట్‌ను కేటాయించారు. అదే మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌కు పాల్పడిన ఇంగ్లండ్ జట్టు సభ్యులకు మ్యాచ్ ఫీజులో ఐదు శాతం కోత విధించారు.