Sarpanch Candidate Attempts Suicide Over Election Pressure
ఓటమి భయం.. ఆత్మహత్యకు యత్నించిన సర్పంచ్ అభ్యర్థి
కొమురంభీం ఆసిఫాబాద్లో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. కాగజ్ నగర్ మండలం రాస్పెల్లికి చెందిన సర్పంచ్ అభ్యర్థి బొమ్మెల్ల రాజయ్య అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో డబ్బుల వరద పారింది. గెలుపు దక్కించుకోవటం కోసం సర్పంచ్ అభ్యర్థులు పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేశారు. మందు, ముక్క, డబ్బులతో ఓటర్లను ముంచెత్తారు. అయితే, డబ్బులు పంచలేకపోయిన వారు ఓటమి భయంతో అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొమురంభీం ఆసిఫాబాద్లో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. కాగజ్ నగర్ మండలం రాస్పెల్లికి చెందిన సర్పంచ్ అభ్యర్థి బొమ్మెల్ల రాజయ్య అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. డబ్బులు లేకపోవడంతో ఓటమి పాలవుతానన్న భయంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యలు చెబుతున్నారు. రాజయ్య ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
