Serious Road Accident on Srisailam Highway
శ్రీశైలం హైవే రోడ్డులో గోర ప్రమాదం.
కల్వకుర్తి/ నేటి ధాత్రి :
కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామం వద్ద శుక్రవారం నాడు వేగంగా ఒక లారీ బస్సు మరియు బైకును ఢీకొట్టడం జరిగినది. బైక్ పై వెళుతున్నటువంటి రంగాపూర్ గ్రామస్తుడు రాజు (30)అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అచ్చంపేట డిపో బస్సు లో ఉన్న ప్రయాణికులకు 6 రికి గాయాలు అయ్యాయి. వారిని కల్వకుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
