అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాలమాజీ ఎంపీపీ ముక్తిసత్యం,గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
మండలంలో సోమవారం రాత్రి గాలి, దుమ్ముతోకురిసిన భారీ వర్షానికి మండలంలో పంటలు, ఇల్లులు, కరెంటు స్తంభాలు కూలిపోయాయని ప్రభుత్వం స్పందించి సంబంధిత అధికారులతో సర్వేలు చేపించి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని మండల తహసిల్దార్ ఇమ్మానియేల్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల మాజీ ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు మాట్లాడుతూ మండలంలో వందలాది ఎకరాల్లో పంట నేలమట్టం అయిందని, అనేక చోట్ల ఇల్లు కూలిపోయాయని, విద్యుత్ ట్రాన్స్ఫారాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని అన్నారు.
మొక్కజొన్న నష్టపోయిన రైతుకు ఎకరాకు 50 వేలు, మిర్చి ఎకరాకు లక్ష రూపాయలు, వరి పంటకు 50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.మండలంలో కొడవటంచగ్రామంలో వర్షం కు దెబ్బతిన్న పంటను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు యా సారపు వెంకన్న, పర్శక రవి, మానాల ఉపేందర్, బానోతులాలు, వాగబోయిన సుందర్రావు, వాగబోయిన బుచ్చయ్య, ఎట్టి సుధాకర్, ఇసం రమేష్, ఇసం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.